Big Stories

Viral Video: రీల్స్ కోసం స్టంట్స్ చేసి మెడ విరగ్గొట్టుకున్నావ్ కదా బ్రో..

Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని రీల్స్ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడట్లేదు. కొందరు ఎత్తుల నుంచి దూకగా.. మరి కొందరు వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఇందులో చాలా వరకు కొంత మంది అదృష్టం బాగుండి భయటపడుతున్నా.. మరికొంత మంది మాత్రం చాలా సందర్భాల్లో ప్రాణాలనే వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ కుర్రాడు రీల్ చేయడానికి డేంజరస్ స్టంట్స్ చేశాడు. ఈ తరుణంలో ఏకంగా అతని మెడకు బలమైన గాయం అయింది. ఓ బంగ్లాపై నుంచి కిందకు దూకగా తన తలపై బలం పడింది. ఈ స్టంట్ వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -

కొన్ని సెకన్ల విడివి గల ఈ వీడియోలో నలుగురు అబ్బాయిలు కలిసి రీల్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఓ ఇంటి పైకప్పుపైకి ఎక్కి రీల్స్ చేయాలని అనుకున్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ రీల్ చేయడానికి పైకప్పు నుండి దూకాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో తన వంతు వచ్చిన వెంటనే, ఒక కుర్రాడు ఆలోచించకుండా ఇంటిపై నుంచి దూకుతాడు. ఈ క్రమంలో రివర్స్ లో దూకుతుండగా యువకుడు తన తలపై శరీరం బరువును మొత్తం ఒకేసారి వేయడంతో మెడలు విరిగాయి. మెడపై బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. గాయం అయిన వెంటనే యువకుడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతడి ఫ్రెండ్స్ వెంటనే యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమచారం. అతను పడిపోయిన తీరు అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది.

- Advertisement -

Also Read: ఎగ్జామ్‌లో కాపీ కొట్టేందుకు మెట్రోలో కూర్చుని స్లిప్ ప్రిపేర్ చేసుకున్న యువతి

పదే పదే స్టంట్స్ చేసే వాళ్లకు ఈ వీడియో ఓ గుణపాఠం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్, వీడియోల కోసం ఇలాంటి ప్రాణాంతకరమైన స్టంట్స్ చేయడం అసలు మంచిది కాదని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News