Big Stories

King Cobra in Amazon Parcel: అమెజాన్ పార్శిల్ లో కింగ్ కోబ్రా.. అదృష్టం బాగుండి అలా జరిగింది (వైరల్ వీడియో)

King Cobra in Amazon Parcel: ఆన్లైన్ షాపింగ్ లో అప్పుడప్పుడు కాస్త వింత పరిస్థితులు ఎదురవుతాయి. పార్శిల్ లో ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు మరొకటి రావడం, నాసిరకం వస్తువులు పంపడం వంటివి జరుగుతుంటాయి. అంతవరకూ ఓకే. కానీ.. ఎప్పుడైనా ఆన్ లైన్ కొరియర్ బాక్స్ లో కింగ్ కోబ్రా వచ్చిందా ? అలాంటి పరిస్థితి ఓ జంటకు ఎదురైంది.

- Advertisement -

అమెజాన్ లో ఎక్స్ బాక్స్ ను ఆర్డర్ చేస్తే.. ఆ పార్శిల్ లో కింగ్ కోబ్రా కనిపించింది. నాగుపామును అల్లంత దూరంలో చూస్తేనే.. లగెత్తేస్తాం. అలాంటిది కళ్లెదురుగా ఓపెన్ చేసిన బాక్సులో నుంచి బయటికొస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దంపతులు అమెజాన్ లో ఎక్స్ బాక్స్ ఆర్డర్ చేయగా.. ఆదివారం ఆ పార్శిల్ వచ్చింది.

- Advertisement -

పార్శిల్ బాక్సును ఓపెన్ చేయగా.. నాగుపాము బుస్సుమంటూ పైకొచ్చింది. కానీ.. అదృష్టవశాత్తు బాక్సు టేపుకు అంటుకుపోవడంతో.. వారికి ఎలాంటి హాని జరగలేదు. దీనినంతటినీ ఆ జంట వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాము రెండురోజుల క్రితం అమెజాన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేయగా.. ప్యాకేజీలో బతికున్న నాగుపాము వచ్చిందని చెబుతూ.. ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. అదృష్టం బాగుండి నాగుపాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉందన్నారు.

Also Read: Teacher Got Emotional: క్లాస్‌ రూంలోకి ఎంటర్ అయిన టీచర్.. ఏడిపించేసిన స్టూడెంట్స్ వీడియో వైరల్

ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధులను సంప్రదించగా.. అమెజాన్ ఇండియా ట్వీట్ చేసింది. ఆ దంపతులకు క్షమాపణలు తెలిపిన టీమ్.. త్వరలోనే అలా ఎందుకు జరిగిందో తెలుసుకుని అప్డేట్ ఇస్తామని తెలిపారు. కాగా.. ఆ బాక్సులో వచ్చిన పామును నిర్మానుష్య ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దానిపై భిన్నంగా స్పందిస్తున్నారు. అమెజాన్ కింగ్ కోబ్రాలను కూడా డెలివరీ చేస్తుంది కాబట్టే ఇది ఆన్లైన్ షాపింగ్ లో లీడర్ గా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News