Big Stories

Anant Ambani Wedding Card: అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు చూస్తే వావ్ అనాల్సిందే.. ఓపెన్ చేయగానే..!

Anant Ambani Extravagant Wedding Invitation: సంపన్న పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్ కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. ఈ వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అంబానీ ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను పంచి పెట్టే పనుల్లో నిమగ్నమైంది.

- Advertisement -

అయితే ముందుగా వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి అనంత్ తల్లి నీతా అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు, ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందించింది. ఈ క్రమంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టెలో కళాఖండంగా తీర్చిదిదిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అనంత్, రాధిక పేర్లలోని తొలి అక్షరాలు, లైట్లు, ఎరుపు రంగుతో వెడ్డింగ్ కార్డును అలంకరించారు. ఇక, ఆ బాక్స్ ఓపెన్ చేయగానే..ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. మొత్తం ఓపెన్ చేసిన వెంటనే వెండితో చేసిన ఆలయం, ఆ తర్వాత ఆలయం లోపల వెండితో చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని బంగారంతో చేసిన విగ్రహాలూ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కార్డుతోపాటు పలు బహుమతుు కూడా స్వయంగా అంబానీ ఫ్యామిలీ అతిథులకు అందజేస్తుంది.

Also Read: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ మూడవ అంతస్తు నుండి పడిపోయిన యువతి..

ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం రూ.6.50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 3 కేజీల వెండి దేవాలయంతో పాటు 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా తయారుచేయించారు. దీంతో అత్యంత ఖరీదైన వివాహం అంటూ వైరల్ అవుతోంది. అయితే గతంలో అంబానీ కూతురు ఇషా అంబానీ వెడ్డింగ్ కార్డు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జరగనుంది. ఈ వేడుకకు దేశ, విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారు. అయితే తమ వివాహానికి రావాలని ప్రముఖులు, సన్నిహితుల ఇంటికి వెళ్లి అనంత్ అంబానీ ఆహ్వానిస్తున్నారు. ఈ వివాహ వేడుకలు జూలై 12, 13,14 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News