Big Stories

Metro Viral Video: ఎగ్జామ్‌లో కాపీ కొట్టేందుకు మెట్రోలో కూర్చుని స్లిప్ ప్రిపేర్ చేసుకున్న యువతి

Metro Viral Video: మెట్రోకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. మెట్రోలో డ్యాన్స్ లు చేయడం, పాటలు పాడడం, కొట్లాడుకోవడం, రొమాన్స్ చేయడం, గొడవపడడం, దుర్భాషలాడడం వంటి చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ అమ్మాయి వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువతి సరిగా చదువుకోలేక పరీక్షలో కాపీ చేసేందుకు స్లిప్ ప్రిపేర్ చేసుకుంటుంది. దీనిని అక్కడే ఉన్న ప్రయాణికులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు.

- Advertisement -

పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ రావాలని కొంతమంది ముందు నుంచే ప్రిపేర్ అవుతుంటారు. కొంత మంది సమయానికి చదువుకునే వారు ఉంటే.. ఇక మరి కొంతమంది మాత్రం పరీక్షల వేళ చీటింగ్‌పై ఆధారపడే విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇందులో చాలా మంది విద్యార్థులు అసలు టీచర్లకు దొరకకుండా కాపీ కొట్టి పరీక్షలు రాస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ మెట్రో వీడియోలో అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. బాలిక పరీక్ష రాయబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మొబైల్‌లో ఆమె ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతోంది. అయితే సమాధానం దొరకకగానే ఆ అమ్మాయి కాళ్ల మీద సమాధానాలు రాస్తూ కనిపించింది. అయితే తరచూ కాపీయింగ్‌కు సంబంధించిన చాలా వీడియోలను చూస్తుంటాం. అందులో అబ్బాయిలు కాపీ కొట్టడం చూసి ఉంటాం. అసలు ఉపాధ్యాయులకు దొరకకుండా కాపీ కొడుతూ ఉంటారు. కానీ ఓ అమ్మాయి ఈ విధంగా పరీక్షల కోసం కాపీ కొట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ యువతి కాపీ చేయడానికి వెనుకాడడం లేదని ఆశ్చర్యపోతున్నారు.

https://Twitter.com/_anamikaaaa/status/1803741611219685685

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News