Big Stories

Dog Attack Video: మహిళపై 15 కుక్కలు దాడి.. వీడియో వైరల్

Dog Attack Video: తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై 15 నుంచి 20 కుక్కలు దాడి చేశాయి. ఇందులో మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జూన్ 21వ తేదీ ఉదయం రాజేశ్వరి అనే మహిళపై కుక్కలు దాడి చేశాయి. బాధితురాలు రాజేశ్వరి మాట్లాడుతూ.. ‘నేను రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్తాను. ఆ రోజు నేను మూడో, నాలుగో బ్లాక్ మధ్య నడుస్తుంటే అక్కడ రెండు కుక్కలు ఉన్నాయి. నేను వాటిని చూసి దూరంగా వెళ్ళాను. కానీ వాటిలో ఒక కుక్క మొరిగింది. చాలా కుక్కలు వచ్చి నాపై దాడి చేశాయి’ అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

కుక్కలు రాజేశ్వరిని చుట్టుముట్టడంతో అదే సమయంలో అటు వైపుగా ఒక బైక్ వచ్చినట్లు తెలిపింది. దీంతో కుక్కలు పారిపోయాయని చెప్పింది. మరోవైపు తన స్థానంలో వేరే ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మాత్రం ప్రాణాలు కోల్పోయే వారని చెప్పుకొచ్చింది. మరోవైపు తనపై దాదాపు 15 కుక్కలు దాడి చేసినట్లు చెప్పుకొచ్చింది. వీధికుక్కలు స్వైర విహారంతో బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలపై ఎంతో మంది తరచూ ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపింది.

- Advertisement -

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీధికుక్కల దాడులు తరచూ జరుగుతున్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News