Big Stories

Pakistan Viral Video: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్‌పై ఎద్దు దాడి చేసిన వీడియో వైరల్

Pakistan Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా రోజుకు ఒక వీడియో నెట్టింట అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ రిపోర్టర్ లైవ్ లో రిపోర్టింగ్ చేస్తుండగా ఓఎద్దు దాడి చేసింది. అయితే ఆ జర్నలిస్ట్ మహిళ అయి ఉండడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఎద్దులు అంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే ఎర్రటి వస్త్రాలు ధరించిన వారిపై ఎద్దులు దాడి చేస్తాయని భావిస్తుంటారు. అయితే కొన్ని సార్లు వస్త్రాలను బట్టి మాత్రమే కాకుండా ఎద్దులు సాధారణంగా కూడా కోపానికి గురవుతుంటాయి.

- Advertisement -

తాజాగా పాకిస్థాన్‌లో ఇలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఓ జర్నలిస్టు టీవీలో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలో ఓ ఎద్దు దారుణంగా ప్రవర్తించింది. మహిళా రిపోర్టర్ ఎద్దుల అమ్మకాలకు సంబంధించిన ఓ ప్రాంతానికి వెళ్లి లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎద్దులతో పాటు వాటి యజమానులతో కలిసి ముచ్చటిస్తూ లైవ్ రిపోర్టింగ్ చేస్తుంది. ఈ తరుణంలో ఓ ఎద్దు రిపోర్టర్ పై దాడికి యత్నించింది. లైవ్ లో మాట్లాడుతున్న రిపోర్టర్‌పై ఎద్దు ఒక్కసారిగా తోసింది. దీంతో ఆమె కిందపడింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న వారు ఎద్దుని కంట్రోల్ చేసి రిపోర్టర్ ను కాపాడారు.

- Advertisement -

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఎద్దుల రేటుపై యజమానులతో మాట్లాడుతూ వాటి ధరలను కూడా తెలుసుకుని ప్రజలకు లైవ్ టెలికాస్ట్ ఇస్తుంది. ఈ తరుణంలో మహిళ ఎద్దుల రేటు 5 లక్షలు ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఇలా లైవ్ లో ఎద్దులు దాడి చేయడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News