Big Stories

Man Holds Running Tractor Tire: అరేయ్.. ఏ జంగిల్ నుండి వచ్చార్రా..? రీల్స్ కోసం ట్రాక్టర్ వీల్ మధ్యలో..

Man Holds Running Tractor Tire for Reels: ఈ రోజుల్లో ఎందుకో తెలియదు కానీ చాలా మంది ప్రజలు మాత్రం రీల్ ఫీవర్‌తో సతమతమవుతున్నారు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రీల్ చేసి ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాడు. తన వీడియోపై వీలైనన్ని ఎక్కువ లైక్‌లు వ్యూస్ రావాలని నానా అవస్థలు పడుతున్నారు. దీని కోసం వారు తమ జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు.

- Advertisement -

కేవలం రీల్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఓ అమ్మాయి ఓ అబ్బాయి చేయి పట్టుకుని ఎత్తైన భవనం నుంచి వేలాడే స్టంట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చూసిన త‌ర్వాత మీ క‌ళ్ల‌ను మీరెవ‌రూ న‌మ్మ‌లేరు.. రీలు కోసం దైనికైనా రెడీ అన్నట్టుగా ఉంటుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ట్రాక్టర్ వెనుక టైర్‌కు మధ్య గట్టిగా బిగించి చేతులతో పట్టుకున్నట్లు కనిపిస్తుంది. దీని తర్వాత ఓ వ్యక్తి ట్రాక్టర్ నడపడం ప్రారంభిస్తాడు. టైర్‌లో ఉన్న ఆ వ్యక్తి సర్కిల్‌లలో కదలుతూ ఉంటాడు.

Also Read: హా..హా.. అద్దంలో తనను తాను చూసుకుని బెదిరిపోయిన చిరుత.. నవ్వులు పూయిస్తున్న వీడియో!

ఈ సమయంలో చేయి ప్రమాదవశాత్తూ జారిపోయి ఉంటే టైరు కింద పడిపోతే ప్రాణాలు పోయేవి. కానీ అతను ఈ విషయాన్ని పట్టించుకోడు. 15 సెకనుల పాటు అలానే టైరు మధ్యలో తిరుతూ ఉంటాడు. ట్రాక్టర్ నడిపే వ్యక్తి కాస్త వేగంగా డ్రైవ్ చేసిన కిందపడిపోయేవాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో @PalsSkit అనే ఖాతాతో నుంచి అప్‌లోడ్ అయింది.  వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, ‘జాన్ జాయే బట్ స్టంట్‌పంతి నా జాయే’ అనే క్యాప్షన్‌లో ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే 1400 మంది చూశారు. 68 మంది కామెంట్లు చేశారు. నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. మన దేశంలో ఇటువంటి వారికి కొదవలేదని అన్నారు. మరొకరు అతనిని ఏమనాలో పదాలు రావడం లేదని కామెంట్ చేశాడు. టాలెంట్‌కు జోహార్లు అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News