Big Stories

IND vs ENG T20 World Cup 2024: గయానా స్టేడియంలో భారీగా వర్షం.. మ్యాచ్ జరుగుతదా..? రద్దయితదా..??

IND vs ENG T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ జరగనున్న గయానాలోని ప్రొవడెన్స్ స్టేడియంలో భారీగా వర్షం కురుస్తోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది.

- Advertisement -

అయితే, టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే మిగిలింది ఉంది. అప్పటివరకు వర్షం తగ్గుతుందా..? లేదా ? అనేది ఉత్కంఠగా మారింది. మరో విషయమేమంటే.. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. లేదంటే.. కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపే అవకాశం ఉంటుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ క్రమంలో సూపర్-8 లో టేబుల్ టాపర్ గా ఉన్న టీమిండియా నేరుగా ఫైనల్ కు చేరుకోనున్నది.

- Advertisement -

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో ఓటమి లేకుండా గ్రూప్ -1 లో టీమిండియా టాప్ లో ఉంది. గ్రూప్ -2 లో ఇంగ్లాండ్ రెండోస్థానంలో కొనసాగుతుంది. నెట్ రన్ రెట్ కు తోడు.. ఎక్కువ పాయింట్స్ వల్ల టీమిండియా ఫైనల్ కు చేరనున్నది. ఈ నెల 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.

అయితే, టీమిండియా – ఇంగ్లండ్ జట్లు తలపడినప్పుడల్లా మ్యాచ్ ఉత్కంఠ కొనసాగుతుంది. వర్షం తగ్గి మ్యాచ్ ఆడితే మాత్రం ఇంగ్లండ్ పై టీమిండియా విజయాల శాతం ఎక్కువగా ఉందంటూ గూగుల్ పేర్కొన్నది. టీమ్ ఇండియా విజయాల శాతం 58 శాతం కాగా, ఇంగ్లండ్ జట్టుకు 42 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

ఇండియా టీమ్ మెంబర్స్.. రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీమ్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

ఇంగ్లండ్ టీమ్ మెంబర్స్.. జోస్ బట్లర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, సామ్ కర్రాన్, హ్యారీ బ్రూక్, క్రిస్ జోర్దాన్, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్ ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News