Big Stories

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

Amit Shah high-level meeting: జమ్ముూకశ్మీర్‌లో వరుసగా జరగుతున్న ఉగ్రవాద అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాథికారులను ఆదేశించారు. ఈ నెల 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అమిత్ షా ఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశంఉన్నందున ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

- Advertisement -

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. ఉగ్రవావద చర్యలను నియంత్రించేందుకు భద్రత దళాలకు వెంటనే తగిన సూచనలు ఇవ్వాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లను నివారించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఆదేశించారు.

- Advertisement -

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా సమీక్షలో ప్రస్తావించారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో రాజీపడే సమస్యే లేదన్నారు. సైనికాధికారులు నిరంతరం పటిష్ట నిఘాతో ఉగ్రదాడులకు అడ్డుకట్ట వేసేలా చూడాలన్నారు. మరోవైపు అమర్ నాథ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు భీమా సదుపాయం కల్పించాలని అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News