EPAPER
Kirrak Couples Episode 1

Alphabet loses: బార్డ్ షాక్.. గూగుల్ షేక్..

Alphabet loses: బార్డ్ షాక్.. గూగుల్ షేక్..
Alphabet loses

Alphabet loses $100 billion m-cap

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీకి పోటీగా.. బార్డ్ పేరుతో గూగుల్ కూడా ఓ చాట్‌బాట్‌ తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్న ‘బార్డ్’కు సంబంధించి… ఓ ప్రమోషనల్ వీడియో కూడా విడుదల చేసింది. అదే ఇప్పుడు గూగుల్ కొంపముంచింది. ఆ వీడియోలోని ఓ చిన్న పొరపాటు కారణంగా… గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేరు విలువ ఒక్కరోజే ఏకంగా 100 బిలియన్ డాలర్లు కుంగింది. అంటే మన కరెన్సీలో రూ.82,500 కోట్లకు పైమాటే. ఆల్ఫాబెట్ షేరు విలువ 2022లో ఏకంగా 40 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి 15 శాతం పెరగడంతో… రికవరీ అవుతోందని ఇన్వెస్టర్లు ఆనందపడ్డారు. అంతలోనే మళ్లీ 8 శాతం మేర నష్టపోవడంతో గగ్గోలు పెడుతున్నారు.


బార్డ్‌ ప్రమోషనల్ వీడియోలో చిన్న తప్పిదమే… గూగుల్ షేక్ అవడానికి కారణం. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు బార్డ్‌ ఇచ్చిన సమాధానాల్లో ఒకటి తప్పని తేలింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్‌ వెబ్‌ స్పేసే తీసిందని బార్డ్ జవాబిచ్చినట్లు ప్రమోషనల్ వీడియోలో ఉంది. నిజానికి యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్‌ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను ముందుగా తీసింది. ఈ పొరపాటు కారణంగా… బార్డ్ సామర్థ్యంపై ఇన్వెస్టర్లు అనుమానపడ్డారు. అంతే… భారీగా ఆల్ఫాబెట్ షేర్లు అమ్మేశారు. దాంతో… షేరు ఏకంగా 8 శాతం మేర పతనమైంది. 100 డాలర్ల కంటే తక్కువ స్థాయికి వచ్చింది. ఈ దెబ్బకు ఆల్ఫాబెట్ కంపెనీ విలువ 100 బిలియన్‌ డాలర్ల మేర ఆవిరైంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే… బార్డ్ కంటే ముందే చాట్‌జీపీటీ పేరుతో చాట్‌బాట్‌ రూపొందించిన ఓపెన్ఏఐలో పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్‌ షేర్లు 3 శాతం మేర పెరగడం.


Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×