BigTV English

Rishi Sunak:పరిశోధకులకు రిషి సునక్ గుడ్ న్యూస్..!

Rishi Sunak:పరిశోధకులకు రిషి సునక్ గుడ్ న్యూస్..!

Rishi Sunak:కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాదు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రత్యేక స్థానం ఉంది. ముందు సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటేనే దేశం ముందుకెళ్తుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ డిపార్ట్మెంట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఒక అభివృద్ధి చెందిన దేశం కూడా దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించనుంది.


సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి అనుగుణంగా యూకే ప్రభుత్వం తొలిసారి వైట్‌హాల్ డిపార్ట్మెంట్‌ను ఏర్పాటు చేసింది. రిషీ సునక్.. యూకేకు ప్రధానిగా ఎంపికయిన తర్వాత.. తొలిసారి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. డిపార్ట్మెంట్స్‌ను రీ షఫిల్ చేసిన తర్వాత కొత్తగా నాలుగు డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (డీఎస్సైటీ) కూడా ఒకటి.

డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్, కల్చర్, మీడియా, స్పోర్ట్స్ (డీసీఎమ్మెస్), డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ (బీఈఐస్) అనే విభాగంలోనే ఇంతకు ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆపరేషన్స్ జరిగేవి. ఇంతకు ముందు డీసీఎమ్మెస్‌కు సెక్రటరీగా పనిచేసిన మిషెల్ డొనెలాన్.. ఇప్పుడు డిఎస్సైటీకి సెక్రటరీగా వ్యవహరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఉండడం వల్ల పబ్లిక్ సర్వీసులను పెంపొందించడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఉపయోగపడుతుందని యూకే ప్రభుత్వం భావిస్తోంది.


డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. యూకేను ప్రపంచంలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ ఎకానమీగా నిలబెట్టనుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. యూకేను సైన్స్ అండ్ టెక్నాలజీ సూపర్ పవర్ చేయాలనుకున్న వారి లక్ష్యం త్వరలోనే నిజం కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2022న డిజిటల్ సెక్టార్‌ను పెంపొందించాలని యూకే టార్గెట్‌గా పెట్టుకుంది. 2025 వరకు పలు లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా 6,78,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×