Big Stories

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Comedian Ali: కమెడియన్ ఆలీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు అధికారికంగా తెలిపాడు. బాలనటుడుగా కెరీర్ మొదలుపెట్టి.. స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఆలీ.. 2019లో వైసీపీలో చేరాడు. ఆ తరువాత జగన్.. ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించాడు.

- Advertisement -

ఇక దీనివల్లనే ఆలీ.. తన స్నేహితుడు అయిన పవన్ కళ్యాణ్ కు దూరమయ్యాడు. పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా అందులో చేరకుండా.. వైసీపీ లోనే ఉంటానని చెప్పి.. పవన్ పై కూడా విమర్శలు గుప్పించాడు ఆలీ. ఇక పవన్ సైతం రాజకీయ పార్టీలు వేరుగా ఉన్నప్పుడు స్నేహం మంచిది కాదని, ఆలీని దూరం పెట్టాడు. అలా వీరిద్దరూ విడిపోయారు. ఇక ఈసారి ఎన్నికల్లో పవన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక కూటమి గెలుపుతో వైసీపీ నుంచి ఒక్కొకరుగా బయటకు వస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఆలీ కూడా వైసీపీ నుంచే కాదు పూర్తిగా రాజకీయాల నుంచి కూడా దూరమవుతున్నట్లు తెలిపాడు. ” అందరికీ నమస్కారం.. 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన రామానాయుడు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. బాపట్ల నుంచి నేను ఎంపీగా నిలబడుతున్నాను. నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే.. తప్పకుండా అని వెళ్లి టీడీపీలో చేరాను. 20 ఏళ్ళు అందులో ఉన్నాక వైసీపీలో చేరాను. ఆ తరువాత దాదాపు 1200 సినిమాల్లో నటించాను. భగవంతుడు నాకు దయాగుణం ఇచ్చాడు. దానికి తోడు రాజకీయాల్లో చేరితే ప్రజలకు సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి చేరాను. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు.

నేను ఏ పార్టీలో ఉన్నా వారిని పొగడడమే తప్ప వేరే పార్టీవారిని దూషించింది లేదు. నేను దూషించిన వీడియో వెతికినా దొరకదు. ఇప్పుడు నేను  ఏ పార్టీలో లేను.. ఎవరికి సపోర్ట్ గా లేను. ఇక నుంచి రాజకీయాలకు స్వస్తి చెప్తున్నాను. నా సినిమాలు నేను చేసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News