EPAPER

Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్ర అనుమతి రద్దు

Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్ర అనుమతి రద్దు

Sharmila: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాల వైఎస్ శర్మిల చేపట్టిన పాదయాత్రలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. శనివారం మహబూబాబాద్‌లో పాదయాత్ర నిర్వహించిన శర్మిల స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈక్రమంలో శర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. తన కారవాన్‌లోకి వెళ్లి షర్మిలను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. అలాగే శర్మిల పాదయాత్రను రద్దు చేశారు.


శనివారం నెళ్లికుదురు మండల కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై శర్మిల ధ్వజమెత్తారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడొస్తాడో చూస్తూ అంటూ సవాల్ విసిరారు. ‘‘శంకర్ నాయక్ పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నాడు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా..?. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా..?. మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే, శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్, జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు. నేను తాటాకు చప్పుళ్లకు భయపడను. వైఎస్సార్ బిడ్డ ఇక్కడ’’ అని అన్నారు.

దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, శంకర్‌నాయక్ అనుచరులు శర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. వైఎస్ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను ధ్వంసం చేశారు. పాదయాత్రకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.


Sharmila : తగ్గదేలే.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల మళ్లీ ఫైర్..

Sayanna : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న మృతి..

Related News

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×