Big Stories

Dating Scam in Hyderabad: డేటింగ్ దోపిడి.. బుట్టలో పడేసి పబ్ లకు తీసుకెళ్తున్న యువతులు!

Dating Apps Fraud in Hyderabad: రైట్‌ స్వాప్ చేసి ముద్దుగా ముగ్గులోకి లాగుతారు. మీట్‌ అయ్యే లోకేషన్‌ షేర్ చేస్తారు. రాగానే హాయ్‌ అంటూ పలకరిస్తారు. పబ్‌కు వెళ్దామంటారు. కరువులో ఉండో.. కక్కుర్తి పడో.. కమిట్ అయ్యారో.. క్యాష్‌ అయితే జేబులు ఖాళీ.. క్రెడిట్ కార్డ్‌ అయితే సాలరీ ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు డిడక్ట్ అయ్యిందో కూడా అర్థం కాదు. ఇప్పుడు హైటెక్ సిటీ వేదికగా జరుగుతున్న హైటెక్ మోసం ఇది. దీని డిటెయిల్స్‌ ఏంటో చూద్దాం..

- Advertisement -

ఇప్పుడు ట్రెండింగ్‌ ఏంటి? డేటింగ్ యాప్స్.. అమ్మాయిలు అబ్బాయిలతో అయినా.. అబ్బాయిలు అమ్మాయిలతో అయినా పరిచయం పెంచుకోవడానికి కేరాఫ్‌ అడ్రస్.. రీజియన్, రిలీజియన్, లాంగ్వేజ్.. ఇలా వేటితో సంబంధం లేకుండా.. ఎవరితోనైనా ఫ్రెండ్‌ షిప్‌ చేయడానికి ఇప్పుడు యూత్ ఈ యాప్స్‌ను వాడుతున్నారు. ఇదో ప్రపంచం.. చాలా మంది ఒకరికి ఒకరితో పరిచయమవుతున్నారు. మాటలు నచ్చితే.. పరిచయం వరకు వెళుతుంది. ఆ పరిచయం కలవడం.. ఆ తర్వాత కలిసి ట్రావెల్ చేయడం..ఇదంతా వారి వారి స్కిల్స్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ డేటింగ్‌ యాప్స్‌ను కూడా తమ బిజినెస్‌ను డెవలప్‌చేసుకునేందుకు వాడుతున్నారు కొందరు వ్యాపారవేత్తలు దీనికి బెస్ట్‌ ఎగ్జాంపులే.. హైదరాబాద్‌లో ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఘటనలు.

- Advertisement -

Also Read: TG Group 1 Prelims exam: కాసేపట్లో తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, దాదాపు నాలుగు లక్షల మందికిపైగా…

పేర్లు ఎందుకులెండి కానీ.. హైదరాబాద్‌లో జరిగిన ఓ సీన్‌ను చెప్పుకుందాం.. దాన్ని బట్టి దందా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఓ వ్యక్తికి ఓ డేటింగ్‌ యాప్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. హాయ్.. హాలో నుంచి మొదలైన మాటలు. మీట్ అయ్యే వరకు వెళ్లాయి.. మనం కలుద్దాం.. ఇక్కడికి వచ్చేయి అన్నాడు అతను.. అలా కాదు.. నువ్వే హైటెక్ సిటీ మెట్రో దగ్గరికి వచ్చేయి అంది ఆమె.. మంచిగా రెడీ అయి వచ్చేశాడు అతను.. ఎక్కడికి వెళదామం.. ఇది అతని క్వశ్చన్.. దీంతో పాటు కొన్ని పేర్లు చెప్పాడు. కానీ సింపుల్‌గా వాటిని రిజెక్ట్ చేసింది ఆ అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్‌లోని మోష్ క్లబ్‌ పేరు చెప్పింది.. అక్కడికే వెళదామంది. అమ్మాయి అడిగింది.. అది కూడా ఫస్ట్‌ మీట్.. ఏ అబ్బాయి నో చెబుతారు చెప్పండి.. చలో వెళ్దామన్నాడు.. ఇద్దరు కలిసి వెళ్లారు.. ఆ అమ్మాయి అతడికి మెనూ చూసే చాన్స్ ఇవ్వలేదు. టకా టకా డ్రింక్స్ ఆర్డర్ చేస్తూనే ఉంది. గంట సేపు మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత బాయ్ చెప్పి వెళ్లిపోయింది ఆ అమ్మాయి. అప్పుడు వచ్చాడు బాయ్.. బిల్లుతో.. అది చూసిన అతనికి గుండె గబేల్‌మంది. ఆ బిల్‌ అక్షరాలా 40 వేల 505 రూపాయలు.. యస్.. గంటలో వారిద్దరు కలిసి తాగిన డ్రింక్స్‌ వాల్యూ అది.

వాటర్ బాటిల్ వంద..
చికెన్ టిక్కా 700..
ఫ్రైడ్ రైస్.. 449..
ఇక ఒక్కో డ్రింక్ అయితే 599 నుంచి 2 వేల వరకు..
వీటి బిల్లే 35 వేలకు పైగా అయ్యింది..
అన్నింటికంటే హైలేట్ ఏంటంటే.. ఆ పబ్ చార్జ్‌ చేసిన సర్వీస్ చార్జ్‌ అక్షరాలా 3 వేల 522 రూపాయలు.. ఇది ఆ బిల్లు కథ..

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !

ఇదండి జరిగింది.. ఇందులో ఏం తప్పుంది..? కలిశారు .. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్‌ డ్రింక్స్‌ ఆర్డర్‌ చేశారు. ఇందులో స్కామ్‌ ఏముంది? అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్.. అంత డ్రింక్ చేసిన అమ్మాయి. వచ్చినప్పుడు ఎలా ఉందో.. వెళ్లేప్పుడు కూడా అలానే ఉంది.. నో చేంజ్.. దీంతో బాబుగారికి డౌట్ వచ్చింది. అసలు ఆమె తాగింది ఆల్కహాలా? కోకా? అని.. కానీ ఏం చేస్తాడు.. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు.. బిల్ కట్టేశాడు.. ఆ తర్వాత ఆ పబ్‌ పేరుపై ఉన్న రివ్యూస్‌ చూడటం మొదలుపెట్టాడు. అప్పుడర్థమైంది తాను నిండా మునిగానని.. ఇదంతా పెద్ద స్కామ్ అని.

ఆ పబ్‌కి ఎక్కువగా వచ్చేవారంతా ఇలాంటి బాధితులే అని తెలిసింది. డేటింగ్‌ యాప్‌లో అమ్మాయిలను కలవడం.. వారు ఆ పబ్‌కే తీసుకెళ్లడం.. గంటల్లో వేలల్లో బిల్లులు చేపించడం.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లడం.. ఒకే అమ్మాయి.. చాలా మంది అబ్బాయిలను పబ్‌కు తీసుకెళ్లినట్టు తేలింది. ఒక్కొక్కరితో 20 నుంచి 40 వేల బిల్లు చేయించింది. దీంతో తాను మోసపోయానని అర్థమైంది మన బాధితుడికి అంతేకాదు ఇదంతా పబ్ ఓనర్స్ కొందరు యువతులతో కలిసి చేయిస్తున్న స్కామ్ అని కూడా అర్థమైంది.

Also Read: Aarogyasri: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు

అయ్యా నేను మోసపోయాను.. ఇకపై మీరూ ఇలా మోసపోకండి అంటూ.. అన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ బాధితుడు.. సో అబ్బాయిలు.. డేటింగ్ యాప్‌లో మ్యాచ్‌ కాగానే.. చంకలు గుద్దుకుంటూ వెళ్లిపోకండి.. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు.. సో బీర్ కేర్‌ ఫుల్.. అది మీకు.. మీ మనశ్శాంతికి.. మీ పర్స్‌కు చాలా మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News