Big Stories

CM KCR: కేసీఆర్‌కు ఎలక్షన్ టెన్షన్!.. అందుకేనా కీ డెసిషన్స్?

cm kcr

CM KCR Latest News(Breaking news updates in Telangana): అప్పట్లో మంత్రి ఈటల రాజేందర్‌పై పలు ఆరోపణలు మోపి.. పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. ఈటల టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కేసీఆర్ పాలనపై పలు ఆరోపణలు చేశారు. కొత్త పింఛన్లు ఇవ్వట్లేదని, రేషన్ కార్డుల జారీ లేదని.. విమర్శించారు. అవన్నీ ఓ పేపర్‌పై రాసుకున్నట్టున్నారు సీఎం కేసీఆర్. కొన్ని వారాల వ్యవధిలోనే కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలుపెట్టింది సర్కార్. మునుగోడు ఉపఎన్నిక నాటికి దళితబంధు అంటూ మరో కొత్త పథకం కూడా తీసుకొచ్చారు. అట్లుంటది కేసీఆర్‌తోని.

- Advertisement -

ఇదంతా ఎందుకంటే.. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. గట్టిగా మరో నాలుగు నెలలు మాత్రమే గడువుంది. ఇప్పటికే కేసీఆర్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. సర్వేలతో ఆ విషయం సీఎం దృష్టికీ చేరింది. అందుకే, మరోసారి తన మెదడుకు పదును పెడుతున్నారు కేసీఆర్. ఎన్నికల నాటికి ఫీల్ గుడ్ మూవ్ తీసుకొచ్చేలా.. తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సాల్వ్ చేసేలా కసరత్తు చేస్తున్నారు. గతంలో ఆయన చెప్పినట్టే త్వరలోనే బ్రహ్మాస్త్రంలాంటి కొత్త పథకమూ వదలబోతున్నారని టాక్.

- Advertisement -

ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నామంటే బాగోదుగా. అందుకే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలనే అందమైన పేరుతో.. ప్రజాకర్షణ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అంబేద్కర్ కాంస్య విగ్రహం, కొత్త సచివాలయం, అమరుల స్మారక స్థూపం లాంటి నిర్మాణాలతో ఆకట్టుకున్న కేసీఆర్.. ఇప్పుడిక ప్రజా సంక్షేమ పావులు కదుపుతున్నారు.

జూన్‌ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. పోడు భూముల పట్టాల పంపిణీలో తానే స్వయంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పోడు పట్టాలు పొందిన వారికి సాధారణ రైతుల మాదిరిగానే రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం కూడా అందిస్తామని స్పష్టం చేశారు.

ఇక, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గ్రామాల్లో నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలను పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

జులై నుంచి గృహలక్ష్మి పథకం ప్రారంభించనుంది సర్కారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 3లక్షల ఆర్థిక సాయం అందించనుంది. అటు, దళిత బంధు పథకం కొనసాగింపునకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు సీఎం కేసీఆర్. జూన్‌14న హైదరాబాద్‌, నిమ్స్‌ ఆసుపత్రి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. నిమ్స్‌లో 2వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం కేసీఆర్‌ సడెన్‌గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే.. ఎన్నికలు వస్తున్నాయిగా అందుకే!.. అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News