EPAPER

Vande Bharat Express: వందేభారత్‌ రయ్ రయ్.. మోదీ పచ్చ జెండా..

Vande Bharat Express: వందేభారత్‌ రయ్ రయ్.. మోదీ పచ్చ జెండా..
pm modi vande bharat express

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫామ్ నెంబర్ 10 నుంచి.. వందేభారత్‌ను అధికారికంగా ఆరంభించారు పీఎం మోదీ. అనంతరం, సికింద్రాబాద్ విమానాశ్రయం ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని వెంట గవర్నర్ తమిళిపై, కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఉన్నారు.

అంతకుముందు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ లోనికి వెళ్లి రైలును పరిశీలించారు మోదీ. ట్రైన్‌లో ఉన్న విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. వారి వివరాలు అడిగి.. బాగా చదువుకోమని ఎంకరేజ్ చేశారు.


సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. సూపర్ ఫాస్ట్ రైల్‌లో 12 గంటల జర్నీ పడితే.. వందే భారత్‌తో ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైల్‌లో 8 కోచ్‌లు.. 530 సీట్లు ఉంటాయి. శనివారం ప్రధాని మోదీ ప్రారంభించినా.. ఆదివారం నుంచి సర్వీసులు స్టార్ట్ అవుతాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20701).. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటల కల్లా తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంటుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌లో ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.

తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతిలో మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3080లుగా నిర్ణయించారు. ఇక, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1625, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030లుగా ఉంది. అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీల్లో కాస్త తేడా కనిపిస్తోంది. టికెట్‌ బుకింగ్‌ కన్వీనియెన్స్‌ ఛార్జీలు అదనం.

ఛైర్‌ కార్‌ ఛార్జీలు:
సికింద్రాబాద్ నుంచి నల్గొండ- రూ.470
సికింద్రాబాద్ నుంచి గుంటూరు- రూ.865
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.1075
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.1270
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు:
సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ.900
సికింద్రాబాద్ నుంచి గుంటూరు- రూ.1620
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.2045
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.2455,
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.3080

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×