BigTV English

Vande Bharat Express: మోదీ రాక.. తిరుపతికి త్వరగా.. ఖరీదెంత? ప్రత్యేకతలేంటి?

Vande Bharat Express: మోదీ రాక.. తిరుపతికి త్వరగా.. ఖరీదెంత? ప్రత్యేకతలేంటి?
pm modi vande bharat express

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ప్రారంభోత్సవానికే ప్రధాని మోదీ రావాల్సింది. కానీ, రాలేకపోయారు. ఈసారి మిస్ చేయలేదు. శనివారం సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి హాజరవుతున్నారు. రైలుతో పాటు ఎయిమ్స్ భవనాలు, జాతీయ రహదారులకు శంకుస్థాపన, కొత్త MMTS ట్రైన్ల ఆరంభం.. ఇలా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుంది.


ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వరకు ఉన్న ప్రాంతాన్ని ఎస్పీజీ తమ కంట్రోల్‌లోకి తీసుకుంది. ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు నగరంలో మోడీ పర్యటన కొనసాగనుంది. మోదీ టూర్‌తో సికింద్రాబాద్‌, బేగంపేట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ రాక సందర్భంగా బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

ఇక, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం భారీగా తగ్గనుంది. సూపర్ ఫాస్ట్ రైల్‌కు 12 గంటల జర్నీ పడితే.. వందే భారత్‌తో ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైల్‌లో 8 కోచ్‌లు.. 530 సీట్లు ఉంటాయి. 8వ తేదీన ప్రధాని ప్రారంభించినా.. 9 వ తేదీ నుంచి సర్వీసులు స్టార్ట్ అవుతాయి.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20701).. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటల కల్లా తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంటుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌లో ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.

తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతిలో మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3080లుగా నిర్ణయించారు. ఇక, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1625, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030లుగా ఉంది. అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీల్లో కాస్త తేడా కనిపిస్తోంది. టికెట్‌ బుకింగ్‌ కన్వీనియెన్స్‌ ఛార్జీలు అదనం.

ఛైర్‌ కార్‌ ఛార్జీలు:
సికింద్రాబాద్ నుంచి నల్గొండ- రూ.470
సికింద్రాబాద్ నుంచి గుంటూరు- రూ.865
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.1075
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.1270
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు:
సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ.900
సికింద్రాబాద్ నుంచి గుంటూరు- రూ.1620
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.2045
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.2455,
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.3080

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×