Big Stories

Union Minister Kishan Reddy: కేటీఆర్ వ్యాఖ్యలపై జాలి చూపించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy: సింగరేణికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రమంతి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఓడిపోయామనే బాధలో ఉన్న కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై జాలి చూపించాలి’ అని ఆయన అన్నారు.

- Advertisement -

‘కేంద్రమంత్రిగా సింగరేణి సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తాను. కార్మికులకు అన్ని రకాలుగా ఉండగా ఉంటాను. సింగరేణిలో 49 శాతం వాటా కలిగినటువంటి కేంద్రానికి దానిని రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సంస్థకు లాభం చేకూర్చే విధంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరోజు కూడా పనిచేయలేదు. సొంత ఇంటి పథకం అంటూ ఉద్యోగులు, కార్మికులను మభ్యపెట్టారు తప్ప చేసిందేమీలేదు. వైద్య సదుపాయం, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్, కోలిండియా కార్మికుల తరహాలో జీతాలు ఇస్తామన్న హామీలు ఎటుపోయాయి..? వాటిని తుంగలోకి తొక్కలేదా..?. ఈ తెలంగాణ బిడ్డగా నాకు సింగరేణి ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాటితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం’ అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: లబ్ధిదారులకే పథకాలు.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

‘దేశంలో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరముంది. ఆ దిశగా నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అభివృద్ధికి అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సింగరేణికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తాను. కోలిండియా కూడా వేలంలో పాల్గొంటది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారమే చట్టం చేశాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ. 2 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాం. చట్టంతో మాకేం సంబంధంలేదంటూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ మాట్లాడుతున్నారు.. చట్టం చేసిన సమయమలో మీరు సభలో ఉన్నారు కదా..? మరి అప్పుడెందుకు దానికి మద్దతు ప్రకటించారు..?. సింగరేణి విషయంలో ప్రశ్నిస్తున్న నేతలు మైన్స్ వేలంలో ఎందుకు పాల్గొనలేదు..? ఐరన్ ఓర్, సున్నపురాయి గనులకు సంబంధించి వేలం వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News