Big Stories

Traffic Diversions: రేపు బక్రీద్‌.. హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..?

Hyderabad Traffic Diversions: బక్రీద్ సందర్భంగా రేపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో దాదాపు వెయ్యి మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ప్రార్థనలకు సుమారు 30 వేల మందికి పైగా హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బక్రీద్ సందర్భంగా అన్ని శాఖల అధికారులు, మత పెద్దలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కిషన్ బాగ్, కమాటిపురా, పురానాపూల్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్ పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తామని నగర పోలీసులు తెలిపారు.

- Advertisement -

ప్రార్థనల నిమిత్తం వచ్చేవారి వాహన పార్కింగ్‌ను నెహ్రూ జులాజికల్ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు ఎదుట ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాతబస్తీలో పలు మార్గాల్లో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఆరామ్ ఘర్ వైపు నుంచి ఈద్గాల వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను పోలీసులు అనుమతించరు. దానమ్మ హాట్స్ క్రాస్ రోడ్‌ల వద్ద శాస్త్రిపురం, నవాబ్ సాహెబ్ కుంట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.శివరాంపల్లి, దానమ్మ హాట్స్ నుంచి ఈద్గా, మీర్ఆలం, వైపు ప్రార్థనలకు హాజరయ్యేవారి వాహనాలను దానమ్మ హాట్స్ క్రాస్ రోడ్స్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు.

మెహిదీపట్నం – లక్డీకాపూల్ మధ్య జనరల్ ట్రాఫిక్‌ను మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై నుంచి మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రార్థనలు పూర్తయ్యేవరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. అయితే, మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్ తదితర ప్రాంతాల మీదుగా మళ్లించనున్నారు.

Also Read: కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు..

మాసబ్ ట్యాంక్ వద్ద, మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు వచ్చే ట్రాఫిక్ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా ఖైరతాబాద్ వైపు మళ్లించబడుతుందని, రోడ్ నెంబర్ 12 నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్ హోటల్, ఖైరతాబాద్ వైపునకు మళ్లించనున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, 12ల నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్లే జనరల్ ట్రాఫిక్‌ను చింతల్ బస్తీ వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News