Big Stories

Tough time for KCR : కేసీఆర్‌కు అగ్నిపరీక్ష.. బీజేపీ నుంచి తప్పించుకోగలరా ?

KCR in Local Body Elections(Political news in telangana): తెలంగాణలో అందరి చూపు స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. నిజానికి వచ్చే నెల ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలు కావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే.. కులగణన చేసిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. ఆ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటంతో ఎలాగూ కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ.. రెండో స్థానం ఎవరిది? కేసీఆర్ నిలబెట్టకుంటారా? లేకపోతే బీజేపీ దూసుకుపోతుందా? అనేది చూడాలి.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. మళ్లీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. అదే జరిగితే.. ఆ తర్వాత వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించవచ్చని కమలం పార్టీ వ్యూహం. కాంగ్రెస్ తో సమానంగా బీజేపీకి ఎంపీలు రావడం, కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి ప్లస్ పాయింట్స్.

- Advertisement -

కానీ.. బీజేపీ బలం సిటీల్లోనే తప్ప.. గ్రామాల్లో లేదనేది నిజం. మారుమూల గ్రామాలకు బీజేపీ పార్టీ గురించి కూడా తెలియదు. కానీ, అస్త్రసన్యాసం చేసిన కేసీఆర్ పార్టీని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరిస్తారా? గ్రామాల్లో ఉన్న బలమైన క్యాడర్ ఇప్పటికే పక్కచూపులు చూస్తున్నారు. బీజేపీ కూడా అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్రామాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్శ్ మొదలు పెట్టింది. మరి ఇవన్నీ తట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుందా? లేదా? చూడాలి.

Also Read : నిద్ర లేదు.. సుఖం లేదు.. కేసీఆర్ కు భయం మొదలైందా?

కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్పినా.. అవన్నీ ఒట్టి మాటలే అవుతాయి. ఎందుకంటే ఒక్క ఎంపీ లేరు. రాష్ట్రంలో అధికారం లేదు. ఇలాంటి ప్రతికూల సమయంలో కూడా క్యాడర్ ను కేసీఆర్ ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. రోజు రోజుకి పరిస్థితి దిగజారుతూ వచ్చేది. ఉపఎన్నికల్లో వరుస ఓటములు, సిట్టింగ్ స్థానాలను కూడా కాంగ్రెస్ కోల్పోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని దెబ్బలు తగిలాయి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయారు. అలాంటి టైంలో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. అప్పుడు బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడేవి. ఉపఎన్నికల్లో గెలవడం, జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు చుక్కలు చూపిండంతో బీజేపీదే రెండో స్థానమనే అభిప్రాయం అందరికీ కలిగింది. అయితే.. పార్టీలో రేవంత్ రెడ్డి రోజురోజుకి గ్రోత్ చూపించారు. దీంతో.. రెండో స్థానం కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొదటి స్థానాన్ని కట్టబెట్టారు.

రేవంత్ రెడ్డిలా బీజేపీని ఎదుర్కొని కేసీఆర్ నిలబడతారా? లేదంటే.. అస్త్రసన్యాసం చేసి కూర్చుంటారో చూడాలి. అధికారంలో ఉన్నపుడు అన్ని వ్యూహాలు అనుకూలంగానే అనిపిస్తాయి. ప్రతిపక్షంలో అలా ఉండవు. ఓటములు చూసిన తర్వాత నాయకుల్లో మార్పు రావాలి. 2018లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత.. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించారని రేవంత్ రెడ్డి హుందాగా సమాధానం చెప్పారు. కానీ.. మొన్నటి ఎన్నికల్లో ఓటములను కేసీఆర్ అంగీకరించలేకపోతున్నారు. తన వ్యవహారంలో మార్పు చూపించకపోతే గ్రామస్థాయి నాయకుల పార్టీ మార్పును కూడా కేసీఆర్ అడ్డుకోలేరు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News