Big Stories

Telangana: అమ్ముకో, వాడుకో.. మరో భారీ భూ వేలం..

cm kcr lands

Telangana: కోకాపేట్, బుద్వేల్‌. తెలంగాణలో భూం భూం. భూములు బంగారు తునకగా మారాయి. ఊహించనంత భారీ ధర పలుకుతోంది. కోకాపేట్‌లో ఎకరా 100 కోట్లకు పైగా ధర వచ్చిందంటే మాటలా? బుద్వేల్‌లోనూ కోట్లకు కోట్లతో సర్కారుకు కాసుల పంట పండింది. ఆ రెండు వేలం పాటు చూసి.. ప్రభుత్వానికి మరింత ఆశ పుట్టినట్టుంది. మరో భారీ భూ వేలానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

- Advertisement -

ఈసారి నగర శివారు మొకిలా ఫేజ్-2 భూములను సర్కారు అమ్మకానికి పెట్టింది. రంగారెడ్డి జిల్లా మొకిలాలో 300 పాట్ల అమ్మకానికి HMDA నోటిఫికేషన్ ఇచ్చింది. 98,975 గజాల భూమికి వేలం నిర్వహించనుంది. ఫేజ్ 2 లేఔట్‌లో 300 నుంచి 500 గజాల ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

వేలంలో పాల్గొనాలని అనుకునేవారు రూ.1,180 ఫీజు చెల్లించి.. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందస్తుగా EMD రూ.లక్ష చెల్లించాలి. చదరవు గజానికి రూ.25 వేల అప్సెట్ ధరగా నిర్ణయించింది హెచ్‌ఎమ్‌డీఏ.

మొకిలా ఫస్ట్ ఫేజ్‌లో గజానికి అత్యధికంగా 1లక్ష 5వేలు.. అత్యల్పంగా 72 వేలు ధర పలికింది. ఆ లెక్కన ఫేజ్ 2లో సుమారు 800 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అయితే, వరుసగా ప్రభుత్వ భూముల అమ్మకంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ముందు కావాలనే సర్కారు భూములను అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతు రుణమాఫీకి డబ్బులు లేవని.. దానికోసమే భూములు అమ్ముతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇటీవల చెప్పడం కలకలం రేపింది. త్వరలోనే మరిన్ని కొత్త పథకాలను కేసీఆర్ తీసుకురాబోతున్నారని.. వాటి కోసమే ఇలా భూములు అమ్మేసి.. భవిష్యత్ తరాలకు ప్రభుత్వ స్థలాలు లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నాయి విపక్షాలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News