Big Stories

Telangana ICET Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే

Telangana ICET Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జీ వీసీ వాకాణి కరుణ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ఐసెట్ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 80 వేల మంది హాజరు కాగా వీరిలో 71,647 మంది పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఇందులో 33,928 మంది పురుషులు, 37,718 మంది మహిాళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5543 మంది నాన్ లోకల్ కేటగిరిలో అర్హత సాధించినట్లు తెలిపారు.

- Advertisement -

కాగా, జూన్ 5,6 తేదీల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంబీసీ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల ప్రిలిమినరీ కీని ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి..

ఐసెట్ ఫలితాలను తెలుసుకోవాలనుకునే వారు ముందుగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్‌లోని హొంపేజీలో ICET Results 2024 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ర్యాంక్ కార్డు వస్తుంది. దీనిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిషన్ సమయంలో ర్యాంకు కార్డు అవసరం అవుతుంది కాబట్టి ప్రింట్ తీసుకోవడం మంచిది.

ఐసెట్ రెస్పాన్స్ షీట్లు

ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి https://icet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లి హోంపేజీలో చూస్తే Download Response Sheets అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నెంబర్ ను అడుగుతుంది. వాటిని ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News