Big Stories

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి.. హైకోర్ట్‌లో షాక్

Telangana High Court shock to Malla Reddy(TS politics): ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతుల్లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్‌ క్యాంప్‌స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ.. బాలనగర్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. నవీన ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు మరికొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

ఇటీవల జస్టిస్‌ సీ.వీ.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీ అనుమతులు లేకుండా ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రం ఏర్పాటు చేయరాదన్నారు. ఈ కేంద్రంలో బీకాం, బీఎస్సీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌లు చేపడుతున్నారని, వీటిని నిలువరించేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

- Advertisement -

Also Read: తెలంగాణలో రాజ్యసభ సీటుపై చర్చ, రేసులో అభిషేక్‌ మనుసింఘ్వీ!

దీనిపై స్పందించిన జస్టిస్ సీ.వీ భాస్కర్ రెడ్డి.. యూజీసీ నిబంధనల ప్రకారం అనుమతి పొందాల్సి ఉందన్నారు. హైకోర్ట్ ఇచ్చిన నోటీసులు వర్సిటీ అందుకోలేదని, విచారణకు హాజరు కాలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతుల్లేకుండా నిర్మించిన మల్లారెడ్డి యూనివర్సిటీ, ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. తరువాత విచారణను ఈ నెల అంటే జులై 24వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News