Big Stories

TG EAMCET 2024 Counselling: తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పు.. కొత్త తేదీలివే..!

Telangana EAMCET 2024 Counselling Schedule date Change: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ కు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ ను వాయిదా వేసింది. మూడు విడతలుగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరగనున్నది.

- Advertisement -

జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడతగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అదేవిధంగా జులై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జరగనున్నది.

- Advertisement -

జులై 26 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జులై 27న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. జులై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు, ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనున్నది. ఆగస్టు 9న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయనున్నారు. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సీట్ల కేటాయింపును ఆగస్టు 13న చేయనున్నారు. అయితే, కన్వీనర్ కోట ఇంటర్నల్ స్లైడింగ్ కు ఆగస్టు 21 నుంచి అవకాశం కల్పించారు.

Also Read: ఆన్ లైన్‌లో రైల్వే టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష.. రైల్వే శాఖ క్లారిటీ!

కాగా, కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. మరింత సమాచారం కోసం వైబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొన్నది.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మే 7, 8న ఎంసెట్ అగ్రికల్చర్.. 9, 10, 11న ఎంసెట్ ఇంజినీరింగ్ మరియు ఫార్మసీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News