Big Stories

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సోమవారం, మంగళవారం ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి.. పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికతోపాటు పలు అంశాలపై వారితో చర్చించే అవకాశముంది. పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

- Advertisement -

లోక్ సభ ఎన్నికలు ముగిసిన పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదా జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చంటూ చర్చిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిథ్యం దక్కగా, పలు జిల్లాలకు అసలు చోటే లభించలేదు.

- Advertisement -

Also Read: ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి పొంగులేటి

మరోవిషయం ఏమిటంటే.. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా, మరికొంతమంది చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే నలుగురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటూ సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News