Big Stories

CM Revanth Reddy Warning: భూకబ్జాలపై రేవంత్ పంజా.. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం..!

CM Revanth Reddy Warning To Land Grabbers: ప్రతి ఒక్కడి కన్ను సర్కార్‌ భూమిపైనే.. ఎక్కడ ఖాళీగా ఉందా అని ఎదురుచూసేవాడే. కనిపిస్తే క్షణాల్లో కబ్జా చేయడం. ఇది మనం రెగ్యులర్‌గా చూస్తునే ఉంటాం. మొన్నటి మియాపూర్‌ ఉదంతం కూడా సేమ్‌ ఇలాంటిదే.. అందుకే సర్కార్‌ ఈ కబ్జాలపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. అలాంటివాటికి చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఏంటా విభాగం.. ఆ వింగ్ చేసే పని ఏంటి? కబ్జా. డైలీ కాకపోయినా.. వీక్లీ ఒకసారైనా మనం ఈ పదం పలకడమో.. వినడమో.. చూడటమో చేస్తాం.

- Advertisement -

మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టుగా ఉంది. ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ రాత్రికి రాత్రే బోర్డులు పాతేయడం కామన్ అయింది. కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మళ్లీ నిందితులే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో ఆ కేసులు పెండింగ్ గా ఉంటున్నాయి. దాంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతోంది. ఇక మరికొందరు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటున్నారు. మొన్నటి మియాపూర్ ఉదంతమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ పేదలకు భూములు పేరుతో ప్రభుత్వ ఆస్తిని కబ్జాకు పెట్టేశారు మళ్లీ పోలీసులు ఎంటరై వారిని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. మూడు నాలుగు రోజుల పాటు పోలీసులు అక్కడే పికెట్ ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.

- Advertisement -

అందుకే సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీనియర్‌ IPS అధికారి నేతృత్వంలో స్పెషల్ వింగ్ ఏర్పాటుకానుంది. ఆస్తుల పరిరక్షణ విభాగం పేరుతో ప్రత్యేక వింగ్‌ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపనుంది. సదరు అధికారి నేరుగా పురపాలకశాఖ కార్యదర్శికి లేదా సంబంధిత శాఖ మంత్రికి రిపోర్ట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ వింగ్ కు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వనుంది. ఎందుకంటే కబ్జాలపై రెవెన్యూ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఇతరత్రా పనుల వల్ల పూర్తిస్థాయిలో దానిపై ఫోకస్ పెట్టడం లేదు. అదే ప్రత్యేక విభాగం ఏర్పాటు అయితే ఆ వింగ్ ఎప్పుడూ ఆ పని మీదే ఉంటుంది.

Also Read: రేవంత్ కేబినెట్ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్, జూలై ఫస్ట్ వీక్‌లో ఛాన్స్

కబ్జాలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తారు. అలాంటి భూములను గుర్తించి రక్షిస్తారు.
ప్రస్తుతం గ్రేటర్ తో పాటు HMDA పరిధిలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి. ఎకరం భూమి ధర వందల కోట్ల రూపాయలు పలుకుతుంది. ధరలు పెరగడంతో కబ్జాలు కూడా పెరుగుతున్నాయి. బడాబాబులు రాజకీయ పలుకుబడితో ఇప్పటికే సర్కారు భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న ప్రైవేట్ ల్యాండ్ ను కొనుగోలు చేస్తారు. తర్వాత ఆ ప్రభుత్వ భూమికే సున్నం పెట్టాలని చూస్తారు. కింది స్థాయి రెవెన్యూ సిబ్బందితో మిలాఖతై రికార్డులను సైతం తారుమారు చేస్తారు.

కానీ ఇప్పుడు అవన్నీ కుదరవు.స్పెషల్‌ వింగ్‌ వారిపై ఉక్కుపాదం మోపనుంది. ప్రభుత్వ నిర్ణయంతో కబ్జాకోరులకు దడ మొదలైంది. ఇప్పటికే కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులకు గుబులు పట్టుకుంది. ఇన్నాళ్లూ.. తమకున్న రాజకీయ పలుకుబడి, పరపతిని అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. సో బీకేర్ ఫుల్.. ల్యాండ్ గ్రాబర్స్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News