Big Stories

CM Revanth Reddy On DS Demise: విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Comments On D Srinivas Demise: విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా డీ శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

- Advertisement -

నిజామాబాద్‌లోని డీఎస్ స్వగృహంలో ఆయనకు నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితర ప్రముఖులు డీఎస్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీఎస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర మరువలేనిది అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -

కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్ లో డీఎస్‌‌ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారని ఆయన పేర్కొన్నారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని డీఎస్ కోరిక అని అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బలహీన వర్గాల నేతలను డీఎస్ ప్రోత్సాహించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు. వారి కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా శుక్రవారం ప్రభుత్వ లాంఛనాతో డీ శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్‌లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు డీఎస్ కుటుంబ సభ్యులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News