Big Stories

CM Revanth Reddy: సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారు.. కొంతైనా తిరిగివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Inaugurated Vehicles for TG NAB: సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని.. కొంతైనా తిరిగివ్వండని సనీపరిశ్రమను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నియంత్రరణకు చిరంజీవి వీడియో సందేశం పంపిచారని.. మిగతావారు కూడా ముందుకు వచ్చి డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి తోడ్పడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీస్ మీట్‌కు హాజరైన సీఎం రేవంత రెడ్డి ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు.

- Advertisement -

టీజీ న్యాబ్ కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు.. సైబర్ సెక్యురిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మీట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్ గురించి మాట్లాడారు. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయిని.. మీడియా వీటిపై ఫోకస్ చేయాలని కోరారు. పోలీసుల కృషికి మీడియా కూడా తోడవ్వాలని తెలిపారు.

- Advertisement -

సినిమా వాళ్లు సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని.. వారి తోడ్పాటు కోసం కొంతైనా తిరిగివ్వాలని కోరారు సీఎం. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని అన్నారు. నేరాలు అరికట్టేందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యే గుర్తింపునిస్తామని తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు.

Also Read: టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. రంగంలోకి పోలీసులు

ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో మాత్రమే అని.. నేరగాళ్లతో కాదని సీఎం అన్నారు. నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే పోలీస్ వ్వవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని తెలిపారు. గంజాయి మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారులపై దాష్టీకాలు జరగడానికి కారణం మాదకద్రవ్యాలేనంటూ సీఎం పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News