Big Stories

Class 10 advanced supplementary results: రేపు తెలంగాణలో పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Telangana Class 10 advanced supplementary results to be released: తెలంగాణలో పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవొచ్చు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -

ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా, ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇక గతేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

- Advertisement -

ఈ ఏడాది వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News