Big Stories

Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -

రైతు రుణమాఫీతోపాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. రుణమాఫీ అర్హతలు, విధివిధానాలకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాద్ లోని ఉమ్మడి ఆస్తులపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా మద్దతు ధరపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి రూ. 39 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్ లో పలువురు అధికారులు పర్యటించి అధ్యయనం చేశారు.

Also Read: సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తాం: కిషన్ రెడ్డి

కాగా, ఆగస్టు 15 నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. ఇదే తరహాలో రుణమాఫీ విషయంలో కూడా మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News