Big Stories

Delhi: ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి.. వారి పనేనా?

mp asaduddin house

Delhi: ఎంపీ అసదుద్దీన్. AIMIM ఎంపీ. ముస్లిం సామాజిక వర్గానికి బలమైన గొంతుకు. బీజేపీపై పదునైన విమర్శలు చేయడంలో దిట్ట. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే రాష్ట్రాల్లో బరిలో దిగుతూ ఉనికి చాటుకుంటున్నారు. మహారాష్ట్ర, యూపీ, బీహార్‌లోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అయితే, బీజేపీని గెలిపించడానికే.. ఎమ్ఐఎమ్ పరోక్షంగా సహకరిస్తుందనే ఆరోపణ కూడా లేకపోలేదు. కారణం ఏదైనా.. చాలాకాలంగా దేశంలో ఎమ్‌ఐఎమ్ వర్సెస్ బీజేపీ.. వార్ జోరుగా సాగుతోంది.

- Advertisement -

అలాంటి ఎంపీ అసదుద్దీన్‌ ఇంటిపై సడెన్‌గా రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన అధికారిక గృహంలో గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. దాడిలో ఇంటి కిటికీ అద్దాలు పగిలాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఇప్పుడే కాదు గతంలోనూ తన ఇంటిపై పలుమార్లు దాడి జరిగిందని ఎంపీ అసదుద్దీన్ అంటున్నారు. రాళ్లదాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే ఇక సామాన్యులకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. అదే, బీజేపీ నేత ఇంటిపై ఇలా రాళ్ల దాడి జరిగితే ఊరుకుంటారా? ఇప్పటికే పెద్ద గొడవ అయ్యేదని చెప్పారు. దేశానికి ఇలాంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు ఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News