Big Stories

TG Medical Jobs: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల !

TG Medical Jobs: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు ఖాళీల భర్తీ కోసం ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయింది.

- Advertisement -

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 755 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఈ సమస్యను అదిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ఆసుపత్రుల్లో 31 స్టాఫ్ నర్సులు, వ్యాధి నిర్ధారణ కోసం 193 ల్యాబ్ టెక్నీషియల్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

నియామకాల తర్వాత ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లను నియమిస్తారు. రాష్ట్రంలోని వివిధ ఆసుప్రతుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోస్టు భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అంతే కాకుండా వివిధ ఆసుపత్రుల్లో రోగులకు సేవలందించే స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News