Big Stories

Siddaramaiah : కర్నాటక రా.. గ్యారంటీల అమలు చూపిస్తా.. కేసీఆర్ కు సిద్ధరామయ్య సవాల్..

Siddaramaiah : కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య .. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న రెండు చోట్ల గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

అవినీతిని సర్కార్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని సిద్ధరామయ్య తెలిపారు. ప్రజలు కేసీఆర్ ను ఇంటికి పంపుతారనే నమ్మకంగా ఉందన్నారు. నవంబర్ 30 కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సారి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదన్న కేసీఆర్ కు సిద్ధరామయ్య సవాల్ విసిరారు.తమ రాష్ట్రానికి వస్తే 5 గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో చూపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కర్ణాటకకు రావాలని చాలెంజ్ చేశారు.

- Advertisement -

ప్రధాని మోదీపై సిద్ధరామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో బీజేపీ 4-5 సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. మోదీపై ఆధారపడి ఇక్కడ బీజేపీ నేతలు పోటీకి దిగారన్నారు. చాలా మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. ప్రధాని కర్ణాటక ఎన్నికల సమయంలో 48 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారని .. ఆ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. కర్ణాటకలో ప్రధానిపై నమ్మకం పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని స్పష్టం చేశారు. మోదీ 100 సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు తెలంగాణలో
డిపాజిట్లు రావన్నారు. ఇక్కడ ప్రజలు మోదీకి సరైన సమాధానం చెబుతారన్నారు.

ఇంతలా అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను ఎప్పుడూ చూడలేదని సిద్ధరామయ్య అన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. దేశాన్ని అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు. దళితులు, బీసీలు , పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. బీసీలు వెనుకబడి ఉన్నారంటే కారణం మోదీనే అని స్పష్టంచేశారు.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News