E-Paper
Advertisement

Shamshabad Murder: ప్రియురాలిని చంపి.. మ్యాన్‌హోల్‌లో పడేసి.. పూజారి ఘాతుకం.. వివాహేతర సంబంధమే కారణం..

Shamshabad Murder: ప్రియురాలిని చంపి.. మ్యాన్‌హోల్‌లో పడేసి..  పూజారి ఘాతుకం.. వివాహేతర సంబంధమే కారణం..
Advertisement

Murder News Hyderabad(Breaking news updates in Telangana): అతనో ఆలయంలో పూజారి. పేరు వెంకట సాయికృష్ణ. ఆ పక్కనే ఉండే యువతి అప్సర.. తరుచూ ఆ ఆలయానికి వస్తుండేది. అలా అలా వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. అదికాస్తా శారీరక సంబంధంగా మారింది. కలిసిమెలిసి ఉండేవాళ్లు. తిరిగేవాళ్లు. ఒకళ్ల ఇంటికి ఒకళ్లు వెళ్లేవారు. ఆ పూజారికి అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో వారి రిలేషన్ మీద ఎవరికీ అనుమానం రాలేదు.

కట్ చేస్తే.. కొంత కాలం తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ అప్సర.. ఆ పూజారిని ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. అతనేమో ఎంజాయ్ చేసి వదిలేద్దాం అనుకున్నాడు. ఆమె మాత్రం గట్టిగా తగులుకోవడంతో పూజారి ఇరుక్కుపోయాడు. అప్పటికే ఓ సారి అబాషన్ కూడా చేయించినట్టు తెలుస్తోంది.

Advertisement

పెళ్లి పెళ్లి అంటూ అప్సర వెంటబడుతుండటంతో.. పూజారి ఇక ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. సరూర్‌నగర్‌లో ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. శంషాబాద్ పరిధిలోని నర్కుడకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు మాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడు. కారులోనే చంపేశాడు. ప్రాణం పోయిందని కన్ఫామ్ చేసుకున్నాక.. డెడ్‌బాడీని కారులో మళ్లీ సరూర్‌నగర్ తీసుకొచ్చాడు. అక్కడ ఓ మ్యాన్‌హోల్‌లో పడేసి.. ఏమీ తెలీనట్టు ఇంటికొచ్చేశాడు. ఇదంతా జూన్ 3న జరిగింది.

అప్సర తల్లి పూజారి సాయికృష్ణను కలిసి తన కూతురు కనిపించడం లేదని చెప్పింది. భద్రాచలం వెళ్తానని చెప్పిందని ఆమెను నమ్మించాడు పూజారి. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన మేనకోడలు అప్సర కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెడితే.. అది అటూఇటూ తిరిగి మళ్లీ పూజారి చెంతకే చేరింది. సాయికృష్ణనే అప్సరను చంపి.. మ్యాన్‌హోల్‌లో పడేశాడని తేల్చారు పోలీసులు. విచారణలో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు పూజారి. ఆమె మరోసారి గర్భవతి అయ్యిందని.. తనను పెళ్లి చేసుకోమని వేధిస్తుండటంతో.. చంపేశానని చెప్పాడు సాయికృష్ణ.

Advertisement

పూజారి సమాచారంతో మ్యాన్‌హోల్ నుంచి అస్పర డెడ్‌బాడీని బయటకు తీశారు. అప్పటికే హత్య జరిగి వారం గడవడంతో.. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అప్సర గతంలో ఓ తమిళ సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో నటించింది.

Related News

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×