Big Stories

Shabbir Ali Counter: బీఆర్ఎస్ నేతలకు గతాన్ని గుర్తు‌చేసిన షబ్బీర్ అలీ.. మిమ్మల్నే ఫాలో అవుతున్నామంటూ..

Shabbir Ali Counter to BRS Leaders Comments(Telangana politics): బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గతాన్ని గుర్తు చేశారు. మిమ్మల్నే ఫాలో అవుతున్నామంటూ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం తెలపడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా ? అంటూ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా..? అంటూ నిలదీశారు. ఇటు శాసనమండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదాను తొలగించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకు..? కార్యాలయం ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవాలి అంటూ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కోకాపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుని వేలం వేయాలన్నారు. వేలం వేయగా వచ్చే డబ్బులను రుణమాఫీకి ఉపయోగించాలన్నారు. బీఆర్ఎస్ ఖతం అయ్యిందంటూ షబ్బీర్ అలీ అన్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఐదుగురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరారు. అంతకముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని తప్పు బడుతున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ స్పందించి పై విధంగా మాట్లాడారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..

మరో విషయమేమంటే.. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదంటూ పలువురు నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఖాళీ కానుందా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News