Big Stories

Teachers Transfer: తెలంగాణలో ఉపాధ్యాయుల బ‌దిలీ, ప‌దోన్న‌తుల షెడ్యూల్ విడుద‌ల‌

TS teachers transfers latest news(Today news in telangana): తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మూడేళ్లలోపు పదవీ విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పని బదిలీ నుంచి మినహాయింపు లభించింది.

- Advertisement -

మల్టీ జోన్ -1లో శనివారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్- 2లో జూన్ 30వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. కోర్టు కేసులతో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతులకు విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు , పదోన్నతులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. టెట్ తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పదవీ విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Also Read: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల

గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే పదోన్నతులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. జీవో నంబర్ 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తి అయ్యాయి తప్ప.. పదోన్నతులు పూర్తి కాలేదు. గతంలో ఎస్జీటీ బదిలీలు కూడా ఆగిపోయాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News