Big Stories

Revanthreddy cabinet: రేవంత్ కేబినెట్ భేటీ, ప్రధానంగా ఆ అంశాలపైనే…

Revanthreddy cabinet meeting(Telangana congress news): తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. తమ సర్కార్ రైతులకు మొదటి నుంచి అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పుకొచ్చారు. తాజాగా రేవంత్‌రెడ్డి మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం భేటీ కానుంది.

- Advertisement -

ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఆగష్టు 15వ నాటికి ముందే రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సందర్భంగా రుణమాఫీ అమలుపై చర్చించి, మార్గదర్శకాలను ఆమోదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేయాలని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహా యించాలని ఆలోచన చేస్తోంది. అలాగే బడ్జెట్ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాలు, బిల్లులపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

ALSO READ:  నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ..

కేంద్ర బడ్జెట్ తర్వాతే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అధికారులు అంటున్నారు. రానున్న ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు. వీటికితోటు మరికొన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News