E-Paper
Advertisement

Revanth Reddy : పొంగులేటి, జూపల్లితో భేటీ కానున్న రేవంత్ .. కాంగ్రెస్ లో చేరికపై చర్చ..

Revanth Reddy : పొంగులేటి, జూపల్లితో భేటీ కానున్న రేవంత్ .. కాంగ్రెస్ లో చేరికపై చర్చ..
Advertisement

Revanth Reddy news today(Breaking news updates in telangana): తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు మారుతోంది. సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరతారని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం పొంగులేటి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

Advertisement

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనమే. రెండు రోజుల క్రితం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న పొంగులేటి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు.

ఈ నెల 22న ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ వారిని ఆహ్వానించారు. హస్తిన వెళ్లేందుకు పొంగులేటి, జూపల్లి సిద్ధమైయ్యారు.ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మరోవైపు పొంగులేటితో సన్నిహతంగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం ఢిల్లీకి తీసుకెళ్లాలనే విషయంపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

Advertisement

మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల జోష్ కన్పిస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి నేతలను హస్తం గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ నెల చివరి వారంలో భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ ను వీడిన నాయకులను ఘర్‌ వాపసీ పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×