Big Stories

Farmhouse Case : కాంగ్రెస్ టార్గెట్ గానే ఫాంహౌజ్ వివాదం.. సుప్రీం విచారణకు రేవంత్ డిమాండ్

Farmhouse Case : టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే. ఆ పార్టీలు వ్యూహాత్మకంగానే వివాదాలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని సైడ్ చేసేందుకే ఈ ఎత్తుగడ. మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్రల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెర తీశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. మధ్యవర్తులతో పాటు ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

- Advertisement -

సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే ఈ నాటకమంతా నడుస్తోందన్నారు రేవంత్. ఫామ్ హౌజ్ కేసులోు కేసీఆర్ ను ఏ1 గా, కేటీఆర్ ను ఏ2 గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఏసీబీ పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లో ఉందన్నారు. దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ చేయించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

- Advertisement -

మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ తో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఆ ఇష్యూ మూలంగా మూడు రోజులుగా మునుగోడు ప్రచారం మరుగున పడిపోయింది. కావాలనే.. ఓటర్లను డైవర్ట్ చేసేందుకే కారు, కమలం కలిసి ఈ డ్రామా నడిపిస్తున్నారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్ ను లైమ్ లైట్ లోకి రాకుండా చేసేందుకే.. ఆ రెండు పార్టీలు పైకి కొట్లాడుకుంటున్నట్టు నటిస్తున్నా.. అవి కలిసి పని చేస్తున్నాయనేది హస్తం పార్టీ భావన.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News