Big Stories

Revanth Cabinet Expansion: రేవంత్ కేబినెట్ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్.. జూలై ఫస్ట్ వీక్‌లో ఛాన్స్..!

CM Revanth Reddy Cabinet Expansion: రేవంత్‌‌రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆరుగురికి ఛాన్స్ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి నలుగుర్ని మాత్రమే తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ లిస్టును సీఎం రేవంత్‌రెడ్డి హైకమాండ్‌కు ఇచ్చారు.

- Advertisement -

రేవంత్ కేబినెట్‌లో ఆరుగురికి ఛాన్స్ ఉంది. కాకపోతే నలుగురికి మాత్రమే పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇద్దరు పేర్లతో జాబితాను కేసీ వేణుగోపాల్‌కు అందజేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఈ క్రమంలో సీఎం, మంత్రులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి నలుగురు పేర్లతో రావాలని సూచన చేసినట్టు అంతర్గత సమాచారం. నాలుగు మంత్రి పదవులకు ఆరుగురు నుంచి ఎనిమిది మంది రేసులో ఉన్నారు. ఈ ధపాలో ఛాన్స్ ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్‌‌రెడ్డికి అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసినవారికి మొదటి ప్రయార్టీ ఇవ్వనున్నారు. గెలుపు కోసం కష్టపడిన వారికి సెకండ్ ఛాన్స్ కాగా, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ లో చేరి గెలుపుకోసం కృషి చేసినవారికి థర్డ్ ప్రయార్టీ ఇవ్వనున్నారు.

ఇక ఎమ్మెల్యేల చేరిక విషయంలో ముందుకే వెళ్లాలని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ క్లారిటీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నమాట. ఈ లెక్కన రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ALSO READ:  జాడలేని కేటీఆర్.. ఆ పదవి నుంచి తప్పించబోతున్నారా..?

తెలంగాణ పీసీసీ రేసులో మంత్రి సీతక్కతోపాటు ఎంపీ సురేష్ షెట్కార్ ఉన్నారు. బీసీ కేటాలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ముకేష్‌కుమార్ గౌడ్ ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. పీసీసీ చీఫ్‌ విషయంలో ఇప్పుడే తొందర ఎందుకని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ తెలంగాణ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో నిరాశ అలుముకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News