Big Stories

Ramoji Rao Passed Away: బ్రేకింగ్.. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత..!

Eenadu Companies Chairman Ramoji Rao Died at 87: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (87) తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న.. కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు రామోజీరావు. ఇటీవలే ఆయన గుండెకు వైద్యులు స్టంట్స్ వేశారు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన.. చికిత్స పొందుతూ అస్తమించారు. రామోజీరావు పార్థీవదేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -

ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. గుడివాడలో చదువుకున్న ఆయన.. బీఎస్సీ డిగ్రీ అక్కడే పూర్తి చేశారు. ఈనాడు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత అయిన రామోజీ రావుకు ఇద్దరు కొడుకులు. చెరుకూరి సుమన్, కిరణ్ ప్రభాకర్. వీరిలో సుమన్ 45 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబర్ 7న క్యాన్సర్ కారణంగా మరణించారు. 2016లో రామోజీ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

Also Read: Ramojirao Funeral: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..

  • 1962 అక్టోబర్ లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపన
  • 1967లో ఖమ్మంలో ఎరువుల వ్యాపారం
  • 1969 – ఖమ్మంలో అన్నదాత వ్యవసాయం పత్రిక ప్రారంభం
  • 1970 – ఇమేజెస్ అవుట్ డోర్ అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీ ప్రారంభం
  • 1974 – ఆగస్టు 10న విశాఖలో ఈనాడు ప్రారంభం
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News