BigTV English

Rahul Gandhi: BRS అంటే ‘బీజేపీ రిస్తేదార్ సమితి’.. రాహుల్‌గాంధీ స్పీచ్ నెవ్వర్ బిఫోర్..

Rahul Gandhi: BRS అంటే ‘బీజేపీ రిస్తేదార్ సమితి’.. రాహుల్‌గాంధీ స్పీచ్ నెవ్వర్ బిఫోర్..
rahul gandhi brs

Rahul Gandhi latest speech(Khammam meeting live today): రాహుల్ గాంధీ స్పీచ్ నెవ్వర్ బిఫోర్. ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభలో రోటీన్‌కు భిన్నంగా సాగింది రాహుల్ ప్రసంగం. సూటిగా, సుత్తి లేకుండా.. బీఆర్ఎస్, బీజేపీలపై అటాక్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని తెల్చిచెప్పారు. అది ఎలాగో, ఎందుకో కూడా వివరించారు రాహుల్.


కేసీఆర్ తాను రాజు అనుకుంటున్నారని.. తెలంగాణ ఆయన జాగీర్ కాదని హెచ్చరించారు. ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీలు గతంలో దళితులకు, ఆదివాసీలకు, నిరుపేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని మండిపడ్డారు. అవినీతిలో సీఎం కేసీఆర్ దేనినీ వదిలిపెట్టలేదని.. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి.. ధరణి పోర్టల్‌తో భూముల దోపిడీ..
మిషన్ భగీరథ.. ఇలా అన్నిరంగాల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు.

పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే.. బీఆర్ఎస్ మాత్రం మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తోందని అన్నారు. అవినీతి, లిక్కర్ స్కాం.. ఇలా కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉంది కాబట్టే చెప్పినట్టు చేస్తున్నారని విమర్శించారు. అందుకే, తాను బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని పేరు మార్చేస్తున్నానని చెప్పారు.


తెలంగాణలో బీజేపీ ఖతం అయిందని.. ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని.. హైవేపై వెళ్తున్న బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయి ఎక్కడికక్కడే ఆగిపోయిందంటూ పంచ్‌లు వేశారు రాహుల్‌గాంధీ.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు.. బీజేపీ బీ టీమ్‌కు మధ్యే పోటీ నడుస్తోందని.. కర్నాటకలో బీజేపీని ఓడించినట్టే.. తెలంగాణలోనూ బీజేపీ బీ టీమ్‌ను సైతం ఓడించబోతున్నామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలంతా పార్టీ వెన్నుముక అని.. అంతా కలిసి బీఆర్ఎస్‌ను ఈజీగా ఓడించగలరని కేడర్‌లో భరోసా నింపారు. కర్నాటకలో శక్తి చూపించినట్టే.. తెలంగాణలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు శక్తి చూపించి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపు ఇచ్చారు రాహుల్ గాంధీ.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×