Big Stories

Another Notice to KCR: కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన పవర్ కమిషన్..!

Power Commission issued another notice to KCR: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు కమిషన్ కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పవర్ కమిషన్ పేర్కొన్నది. ఈ నెల 27లోగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ ను ఆదేశించింది. కేసీఆర్ తోపాటు జగదీష్ రెడ్డి, మరికొంత మందికి కూడా పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

అయితే, ఇప్పటికే ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్దేశించింది. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. జస్టిస్ నరసింహారెడ్డికి 12 పేజీల సుధర్ఘ లేఖ రాశారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నిటికీ అవసరమైన కేంద్ర ప్రభుత్వసంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు సాగామంటూ ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ చేసేందుకే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించటంలేదంటూ అందులో పేర్కొన్న కేసీఆర్.. కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదన్నారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలంటూ జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: హైకోర్టులో పిటిషన్, తెలంగాణ విద్యుత్ కమిషన్‌ రద్దు చేయాలంటూ…

కేసీఆర్ లేఖపై అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ముందు హాజరైతే కేసీఆర్ కు వచ్చిన బాధేంటంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే కమిషన్ ముందు హాజరవడంలేదంటూ మిగతా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై ఫైరయ్యారు. అయితే, ఈ వివాదం కొనసాగుతుండగానే.. మంగళవారం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసిందంటూ పునురుద్ఘాటించారు.

కాగా, సాయంత్రానికి జస్టిస్ నరసింహారెడ్డికి పవర్ కమిషన్.. కేసీఆర్ కు రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలంటూ అందులో స్పష్టం చేసింది. ఈ నోటీసులపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News