Big Stories

Jagadamba Jewellery Robbery: జగదాంబ జ్యువెల్లరీ షాపు చోరీ కేసు.. 24 గంటల్లో నిందితులు అరెస్ట్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..!

Jagadamba Jewellery Shop Heist Case: తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికాలో సెటిల్‌ అయ్యారు. కొడుకు మాత్రం ఇండియాలో దొంగగా మారాడు. ఇప్పటికే ఓ కేసులో దొరికిపోయి బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈలోగా మరో చోరీ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రీసెంట్‌ గా మేడ్చల్‌ జగదాంబ జ్యువెల్లరీ షాపు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

- Advertisement -

అయితే చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో మెయిన్‌ వ్యక్తి అజీజ్‌ కొటాడియా. మనం ఇంతవరకు మాట్లాడుకుంది అతని గురించే. అతనే బుర్కాలో షాపులోకి ఎంటరై.. ఓనర్ పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్ పై పరారయ్యాడు. ఆ అజీజ్ తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడ దొంగగా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

- Advertisement -

అజీజ్‌ కొటాడియా మహారాష్ట్ర వాసి. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. డిగ్రీ పూర్తికాగానే డబ్బు సంపాదించాలని అమెరికా వెళ్లాడు. ఇంకా మంచి జాబ్‌ దొరకపోదా అనే ఆశతో అక్కడి నుంచి ఆఫ్రికా, చైనా దేశాలు కూడా తిరిగాడు. కానీ చివరకు అమెరికాలోనే కొన్నాళ్లూ ఉద్యోగం చేసి.. తిరిగి 2022లో హైదరాబాద్‌కు వచ్చాడు. కొంపల్లిలో ఉంటూ వివాహం కూడా చేసుకున్నాడు.

Also Read: Jagan going to Bangalore: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా? గాలితో మంతనాలు?

తనదగ్గరున్న డబ్బుతో బిజినెస్‌ స్టార్ట్‌ చేసినప్పటికీ నష్టాలే రావడంతో ర్యాపిడో డ్రైవర్‌గానూ పనిచేశాడు. రెండు బైక్‌లు కొని డ్రైవర్‌లను నియమించుకుని డబ్బు సంపాదించి లండన్‌కు వెళ్లాలి అనుకున్నాడు. కానీ అక్కడ కూడా నష్టాలు చవిచూడటంతో.. ఈజీగా మనీ సంపాదించాలంటే చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ మలక్‌ పేట్ లోని ఓ జువెలరీ షాప్ లో దొంగతనం చేసి ఎస్కేప్ అయ్యారు. సీసీ కెమెరా ఆధారంగా అప్పట్లో పోలీసులకు చిక్కి రిమాండ్ అయ్యారు. ఈ సారి రెక్కీ చేసి స్కెచ్ వేసి చోరీకి పాల్పడ్డారు. కానీ చోరీ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకున్నారు. అజీజ్ తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి.. రిమాండ్ కు పంపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News