Big Stories

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. జడ్జిలు, ఐఏఎస్‌ల ఫోన్‌లు ట్యాప్!

Telangana Phone Tapping Case Update: తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతికల్లో వచ్చిన కథనాలతో సుమెటోగా హైకోర్టు కేసు విచారించింది.

- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నేతలతోపాటు కుటుంబ సభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేశారు. ఇప్పటికే నలుగురు పోలీసులను అరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. అలాగే ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు చేసి కీలక ఫైళ్లను సీజ్ చేసినట్లు తెలిపింది.

- Advertisement -

పోలీసు అధికారి ఇల్లుతో పాటు ఇతర అధికారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించి కేసు నమోదే చేశామని, అయితే కేసు నమోదు కాగానే ఎస్ఐబీ మాజీ చీఫ్ దేశం వదిలి వెళ్లి పోయినట్లు సిట్ పేర్కొంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కుట్రలలో నవీన్ రావుకు సైతం భాగం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ శ్రవణ్ రావుతోపాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.

ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లను సైతం నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితోపాటు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రోస్, దివ్య ఫోన్‌లను సైతం ట్యాప్ చేశారు. ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిని పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సి ఉందని, విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విచారించాలని సిట్ న్యాయస్థానానికి విన్నవించింది.

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News