Big Stories

CM Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలు ఏమీ ఆశించట్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Comments on BRS: ‘కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. హస్తం పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని కె. కేశవరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ మనిషినంటూ నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలతో తెలంగాణ వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై మాట్లాడారు. ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేమన్నారు. ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్నవారు చేశారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్నందునే నైతిక విలువలతో తాను రాజీనామా చేసినట్టు చెప్పారు. రాజ్యసభ చైర్మన్ కు సైతం ఇదే విషయాన్ని చెప్పినట్లు కేకే తెలిపారు.

- Advertisement -

రాజ్యసభ సభ్యత్వానికి కె. కేశవరావు రాజీనామా చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారన్నారు. కేకే సేవలను పార్టీ వినియోగించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడుందో టార్చ్ లైట్ తో కేసీఆర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలు ఏమీ ఆశించట్లేదన్నారు.

Also Read: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత ఫోకసంతా అభివృద్ధిపైనే: సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హనుమకొండలోని రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని చెప్పారు. అవసరమైన మౌలిక సదుపాయలను కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలను స్థాపించాలని కోరారు.

‘ఎన్నారైలకు ఇక్కడ అన్ని రకాల సదుపాయలను కల్పిస్తాం. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. పారిశ్రామికంగా వరంగల్, హనుమకొండ అభివృద్ధి చెందుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీసుకువచ్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ప్రైవేట్ పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం’ అంటూ శ్రీధర్ బాబు అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News