Big Stories

Pen Down Protest: రవాణాశాఖ అధికారుల పెన్‌డౌన్‌..నల్ల బ్యాడ్జీలతో నిరసన

TS transport department protest(Telangana news): రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్‌డౌన్‌కు దిగారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో జేటీసీ కార్యాలయంలో హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేష్‌పై గురువారం ఆటో యూనియన్ జేఏసీ నాయకుడు మహ్మద్ అమానుల్లాఖాన్ దాడి చేశాడు. ఈ దాడికి నిరసనగా శుక్రవారం సేవలు నిలిపివేశారు.

- Advertisement -

రవాణా శాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం పెన్‌డౌన్ ఆలోచనను విరమించుకొని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. కాగా, జేటీసీ రమేష్‌పై దాడికి పాల్పడిన ఆటో యూనియన్ నాయకుడు మహ్మద్ అమానుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

- Advertisement -

ఖైరతాబాద్‌లోని జేటీసీ కార్యాలయంలోకి ఆటోలకు మీటర్లు బిగించాలని కోరుతూ ఆటో యూనియన్ జేఏసీ నాయకుడు మహ్మద్ అమానుల్లాఖాన్ వెళ్లారు. ఈ మేరకు పలు సమస్యలపై జేటీసీ రమేష్‌తో చర్చించిన అనంతరం వినతిపత్రం అందించాడు. ఇందులో ఉన్న పలు అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని జేటీసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏమైందో తెలియదు.. ఒక్కసారిగా అమానుల్లాఖాన్ జేటీసీ దగ్గరికి వెళ్లి చెయ్యి చేసుకున్నారు. ఈ సమయంలో ప్రత్యేక గది ఇద్దరే ఉన్నారని సమాచారం.

ఆటో యూనియన్ నేత ఒక్కసారిగా దాడి దిగడంతో జేటీసీ సిబ్బందిని పిలిచాడు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని అమానుల్లాఖాన్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జేటీసీ ఫిర్యాదుతో ఖైరతాబాద్ పోలీసులు అమానుల్లాఖాన్‌పై కేసు నమోదు చేశారు.

ఈ దాడిని ఆర్టీఏ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు ఖండించాయి. అలాగే జేటీసీపై జరిగిన దాడిని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని, పోలీసులతో మాట్లాడి దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read: సీఎం రేవంత్‌ మనసులోని మాట.. జగన్, కేసీఆర్‌లు బోర్లా పడ్డారు

జేటీసీపై జరిగిన దాడికి నిరసనగా రవాణాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్‌కు దిగారు. ఈ నిరసనకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News