Big Stories

Orr Toll Charges Hike: టోల్ ఛార్జీల పెంపు, ఎన్నికల తర్వాత బాదుడు.. అన్నింటా ధరలు పెరడం ఖాయం!

Orr Toll Charges Hike: ఎన్నికల ముగిసేవరకు అధికార పార్టీలు చాలా సైలెంట్‌గా ఉంటాయి. ఆ తర్వాత రేట్లు పెంచడం మొదలుపెడతాయి. తాజాగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేసిన కేంద్రం, సంబంధిత సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 1100 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో మూడు నుంచి ఐదుశాతం టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. అంతేకాదు అన్నిరకాల వస్తువులు ధరలు పైకి ఎగబాకనున్నాయి.

- Advertisement -

ఇక తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచుకున్నట్లు నిర్వహణ సంస్థ ఐఆర్బీ ఇన్ ఫ్రా ఆదివారం ప్రకటించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్‌ను ఐఆర్బీ సంస్థ గతేడాది 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో పెరిగిన కొత్త ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

- Advertisement -

వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం పెంచిన ఛార్జీలు వచ్చే ఏడాది మార్చి వరకు అమలులో ఉంటాయి. కారు, జీవు, వ్యాను, ఎస్‌యూవీ వాహనాలకు కిలో మీటరుకు దాదాపు రెండు రూపాయలు పెంచారు. అదే మినీ బస్సులైతే మూడున్నర రూపాయలు పైమాటే. బస్సులు, యాక్సిల్ ట్రక్కులైతే ఆరున్నర రూపాయలు పైగానే పెరగనుంది. మూడు యాక్సిల్ వాణిజ్య వాహనాలకు ఎనిమిదిన్నర రూపాయలపై భారం పడనుంది. ఇక భారీ నిర్మాణ యంత్రాలు వాహనాలకు 12 రూపాయలపై పెరగనుంది. ఈ లెక్కన అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడం ఖాయమన్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News