Big Stories

PM Modi: డీఎస్ మరణం ఎంతో బాధించింది: ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతగానో బాధను కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఎక్స్ వేధికగా మోదీ సానుభూతి తెలిపారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రముఖుల సంతాపం:

- Advertisement -

డీఎస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘ కాలం సేవలు అందించారని అన్నారు.

డీఎస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ కాలం డీఎస్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు.

డీఎస్ భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. డీఎస్ పార్థివ దేహానికి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. నిజామాబద్‌కు డీఎస్ మృత దేహాన్ని తరలించిన కుటుంబ సభ్యులు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నాట్లు తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అంతక్రియలకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

డీఎస్ చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు సేవలు అందించారు. డీఎస్ మరణం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. డీఎం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందటం బాధాకరం. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం తన సేవలను అందించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నా- భట్టి విక్రమార్క

1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డీఎస్.. నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. విద్యార్థి దశ నుంచే సంఘ నాయకుడిగా ఉన్న ఆయన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ,యువజన కాంగ్రెస్‌లల్లో పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ తరపున తొలిసారి పోటీ చేసిన డీఎస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందారు.

Also Read: ధర్మపురి అర్వింద్‌కు పితృవియోగం.. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి , ఐ అండ్ పీఆర్ మంత్రిగా.. 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బర్ లాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవడంలో డీఎస్ కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావం తరువాత మండలి విపక్ష నేతగా ఉన్నారు.

రెండవ సారి ఎమ్మెల్సీ అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్‌కు 2015లో రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ పనిచేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News