Big Stories

MLC Kavitha Judicial Custody: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ..

MLC Kavitha Judicial Custody Ends Today(Telangana news): దేశ వ్యాప్తంగా పలు సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు వర్చువల్‌గా హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టు ముందు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. కాగా కవితకు అనుగుణంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అదే రోజున సాయత్రం ఎమ్మల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫస్ట్ నుంచి సూత్రదారి కవిత అని ఈడీ వాదిస్తోంది. లిక్కర్ పాలసీని ఆమెకు అనుకూలంగా చేసుకునేందుకు 100 కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ ద్వారా చెల్లింపులు చేయడంతో ఆమె కీలక పాత్ర పోషించారన్నది మెయిన్ పాయింట్.. అప్పటి నుంచి కొన్ని రోజులు పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు.

- Advertisement -

ఆతర్వాత మార్చి 26 నుంచి ఎమ్మల్సీ కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది సంచలనంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News